పూర్తిగా చూపిస్తాడా?
అలా చూపిస్తే జనం ఊరుకుంటారా?
కోపంతో ఊగిపోరా?
ఇంతకుముందు చూపించినట్టు
కనిపించి కనిపించనట్టు
అర్థమయ్యీ కానట్టు
సగం సగం చూపిస్తాడా?
అసలెందుకిలా చూపిస్తాడు?
ఏం చూపించకుంటే కొంపలు మునిగిపోతాయా?
పోయినసారి చూపించినపుడు
ఎంత గందరగోళం..
అడిగితే “చూసేవాళ్ళు ఇష్టముండే కదా
వస్తారు,చూస్తారు
వాళ్ళు చూడడం మానుకుంటే
నేను చూపడం మానుకుంటాను” అంటాడేం?
ఈసారి ఇంకెవరిని చూపిస్తాడు?
ఎలా చూపిస్తాడు?
యువకుల్లో అయితే ఒకటే ఉత్కంట.
ఉడుకు రక్తం కదామరి ?
పోయిన సారి చూడలేక
నేనైతే మధ్య మధ్య కళ్ళు మూసుకున్నా ..
ఎంత జుగుప్త్సగా ,నీచంగా,నిర్దాక్షిణ్యంగా…
ఇంతకు ముందులా అర్దనగ్నంగా
కాకుండా..అదే నిజాలను..
ఈ సారి నగ్న సత్యాలు చూపిస్తే బాగుండు
ఇంతకీ దేని గురించనుకున్నారు?
అదేనండీ,
.
.
.
.
వర్మ తీసిన రక్తచరిత్ర,
అందులో రక్తపాతం గురించీ,
రాబోయే రక్తచరిత్ర రెండో వెర్షన్ గురించి...
మీరేమనుకున్నారు ?
ఖర్మరా బాబు !!!

photo avasaram ledhura readers nee cheat cheyadaaniki. u wrote really well,..chaala baagundhi sitti
ReplyDeletetention undi but silli ga kuda undi gud chala bagundi sir...
ReplyDelete