Tuesday, November 30, 2010

సెండ్ఆఫ్!





















కన్నీటి ధారొకటి
మనసులో ఆనందంగా ఒదిగిపోయింది!
మేఘమై కరిగిన సంద్రం
నదిలా మారి కడలిని చేరుతున్నందుకు!

క్షణాలు యుగమై, జీవితం
నిశీదిగా మారిందని, మనసు
నిప్పుల కొలిమిలా మారినపుడు
చల్లని స్పర్శలో మాధుర్యం
చేయిదాటిన కలగా  మిగిలిందని
నీ ఆలోచనలు వడగాడ్పుల
వేడిని చిమ్ముతుంటే
బంధాల విలువలు  
లీలగా తోచేవి..

అర్థంకాని  రాజకీయాలు, అంతం లేని
ఆవేదనలూ, సొంతం కాని పరిసరాలు

ఏళ్ళు గడుస్తున్నా ఇక్కడ మనం 
కొత్తవాళ్ళం,
దినాలు ఇంకిపోతున్నా పని మనకు
తొలి పరిచయం!

అయినా, సమసి పోయిన చరిత్రెందుకిపుడు
కరిగి పోయిన వయస్సెందుకు
ఎడమచేత్తో చెప్పెయ్ ఇక వీడుకోలు
క్షణమైనా, ఆత్మశ్వాస దొరుకుతున్నపుడు!!

1 comment: