ఆయాసంగా మెట్లెక్కి
డోర్ తెరిచి, కారిడార్ లోకి
అడుగుపెట్టాను, షూస్ విప్పుదామని!
ఏకాంతంలో ప్రేమికుల్లా
కిచెన్ లోంచి గుసగుసలు!
కొంచెం అనుమానంగా
కిచెన్ కేసి చూశా, ఓరగా
పొద్దున్న పనిమనిషి
పెనం, కుకర్ లను
స్టవ్ పైనే ఆరబెట్టినట్లుంది
సర్దడం మరిచిపోయి
ప్రేమ మైకపు స్వరం పెట్టి
కుకర్ నడిగింది పెనం
" నేనంటే నిజంగా నీకంత ప్రేమా?" అని
దానికి కుకర్ నిర్లక్షంగా అంది
"అదేం లేదు, మామూలు స్నేహమే" అని
ఎందుకు ప్రేమ లేదని
ప్రశ్నించింది పెనం
నువ్ నలుపు, నేను తెలుపు
గోడను తగిలిన బంతిలా
అటునుంచి సమాధానం
పెనంకు కోపమొచ్చినట్లుంది
ఆవేశంగా అరుస్తూంది
అయితే రోజూ నన్ను చూస్తూ
'విజిల్' ఎందుకేస్తావ్?
No comments:
Post a Comment