ఎంత భారంగా ఉందేమిటి?
ఇన్నాళ్ళుగా ఇదే పనేగా, చేస్తుంది
మరి ఇప్పుడేమిటిలా, కొత్తగా?
మోయలేనంత బరువు
సహాయంకోసం వెతకాలి
నా బాష తెలిసిన వాళ్ళు కరువాయే, ఎలా మోసేది?
చాలా సమయం పడుతుంది
ఈ భారం తగ్గించడం ఎలా?
సలహాల కోసం మనసు అన్వేషణ
ఆలోచనలో ఇక్కడి సూర్యుడు
అక్కడికి చేరుకుంటాడు
అదేమిటో, ఇక్కడ సూర్యునికి
పని గంటలు తక్కువ
తనే ముందు నుంచి ఎత్తి
వెనకాలకు విసురుతాడు
భారమైన "రోజు"ను సహాయంగా
నేను మాత్రం "calling it as a day"
No comments:
Post a Comment