ఉతికినవైతే చాలన్నవ్
పాత పుస్తకాలు పంచి, మాకు
కొత్త బతుకులు చూపినవ్
మీ పిల్లల బట్టలు బడిపిల్లలకు వంచి
గా పిల్లల్ని మీ పిల్లల్ని చేస్కున్నవ్
రామ లక్ష్మన్ల పాటం చెప్పి
దోస్తులను అన్నదమ్ముల్లెక్క జేసినవ్
నీతి కథలు చెప్పి
అమ్మయ్యలను దేవున్లలెక్క జూపినవ్
ఏమన పద్యాలూ, సుమతీ శతకాలూ
యాదిజేస్క రమ్మనెటోనివి
సెట్లకింద ఇస్కమీద గూసోవెట్టి
అందరితోని అనిపించెటోనివి
గా సుద్దులు మరువం సారూ
గసొంటి దినాలు మల్లొస్తయ్యా ?
ఇంగ్లీషు పాటం తెలుగుల జెప్పుకుంట
ధబేల్ మని టేబుల్ మీద గుద్దితే
సేనికాడ బర్రె మీదున్న ద్యాస
పుటుక్కున క్లాస్ ల కొస్తుండే
ఇప్పుడట్ల జెప్పెటోల్లే లేరు
గందుకే నా ద్యాస నా తాన లేకుండవాయె
స్కూళ్ళ చదివినన్నాళ్ళూ నీ పేరే ఎరుకలేదు మాకు
‘హెడ్మాస్టరే’ నీ పేరనుకుంటిమి
నీవు 'బసవరాజు'వు గాదు సారూ
గా బడికి రాజువు
మా బతుక్కుతోవవు
విశ్వా మిత్రుని ప్రతిశ్రుష్టి సంగతి చెప్పి
మా గుండెల మనిషిని శ్రుష్టిజేస్నవ్
సదువుల ఎన్కబడ్తే కోపం జేసెటోనివి
ఆటపాటల్ల మమ్ముల పెబ్బెల్ని జేసెటోనివి
సాలెకు సరిగ్గ రాకపోతే
ఇంటికొచ్చి అడిగెటోనివి
ఎప్పటికీ మాతోనే వుండెటోనివి
అందుకే ఆయితారం ఇంటికాడ సుద్రాయించకుండే
గీ దినం నీ యసొంటి సార్లున్నరంటవా ?
గందుకె నీకు థాంక్స్ సారూ!!
------------------------------------------------------------------------
గుస్స – కోపం దోస్తు – స్నేహితుడు
ఏమన – వేమన్న యాది – కంటస్తం, గుర్తు
సుద్దులు – మాటలు, కబుర్లు గసొంటి – అట్లాంటి
గుద్దితే – బాదితే సేను – చేను, పొలం
బర్రె – గేదె ద్యాస – ఆలోచన
పెబ్బే – నాయకుడు, leader సాలె - బడి
------------------------------------------------------------------------
------------------------------------------------------------------------
గుస్స – కోపం దోస్తు – స్నేహితుడు
ఏమన – వేమన్న యాది – కంటస్తం, గుర్తు
సుద్దులు – మాటలు, కబుర్లు గసొంటి – అట్లాంటి
గుద్దితే – బాదితే సేను – చేను, పొలం
బర్రె – గేదె ద్యాస – ఆలోచన
పెబ్బే – నాయకుడు, leader సాలె - బడి
------------------------------------------------------------------------

wonderful telugu poetry blog... i always aspire to write in telugu but due to my ill knowledge of the subject, i only end up reading rather than writing and you have written your thoughts in such a wonderful manner...kudos for being a true telugu...wishing to see more of you in the poems...best wishes for life...
ReplyDeleteమస్త్ చెప్పినవ్ తమ్మి :)
ReplyDeleteVery nice dude, keep rocking!
ReplyDeleteone of your best posts ra,..simply superb
ReplyDeletehello,i am pramila(sandeep friend ni)naku telugu kavithalu antae chala istam,i already talking with u,meru rasina kavitalu naku pamputarukada,this is my mail.id pramila.n218@gmail.com.
ReplyDeletewith regards
pramila.n