బుడి బుడి అడుగులతో
బడికెళ్లే బాల్యం కనుమరుగయ్యింది
చదువుకై పోరాటాలు
మగువపై ఆరాటాలు
సమతుల్యపు అలజడిలో
టీనేజీ యవ్వనం కరిగిపోయింది
ఉద్యోగం వేటలో, ప్రేమ
అస్తిత్వం కోరలో
ఎదిగీ ఎదగని మనసు
ఎదిగిందనే బ్రమలో
చివరిదశ చదువులకు
తెర పడిపోయింది
‘మనీ’శిలై బతకడం కోసం
మనిషిగా మరణిస్తూ
మేనేజ్ మెంట్ ముసుగులో
నన్ను నేను కోల్పోతుంటే
మరపురాని జ్ఞాపకాలిపుడు
దాటిపోయిన మజిలీలైనై
సారమైన హ్యాపీ డేస్ కి
వీడ్కోలు చెప్తూ
భారమైన బతుకువైపు అడుగేస్తూ
తికమక ఆలోచనలతో
మళ్ళీ ఆ తడబడిన అడుగులే ..

No comments:
Post a Comment