గట్టిగా దుప్పటి కప్పుకుని
మత్తుగా నిద్రలో ఉంటే
కౌసల్యా సుప్రజా రామా అంటూ
ఫోన్ అలారం మోగుతుంది
ఓ రెండు సార్లు స్నూజ్ చేసి
మూడో సారికి బద్దకంగా
ఒళ్ళు విరవాల్సిందే..
చల్లని మంచు గాలి
ఒంటికి తగులుతూ ఉంటే
వెచ్చగా టీ కప్పుతో
కారిడార్ లో కూర్చుని
పేపరు తిరగేయాల్సిందే
టి వి ఆన్ చేసి డిబేట్ లోకి వెళ్తే
దూరం కరిగిపోయి ఇంట్లోఉన్నఅనుభవం
కనుక్కున్నవాడికో హాట్స్ఆఫ్
నా ఒంటరి తనానికో నేస్తాన్ని
అందించినందుకు ..

No comments:
Post a Comment